సీమకు నీళ్లేవీ?

ABN , First Publish Date - 2020-08-12T09:20:26+05:30 IST

కరువు సీమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. శ్రీశై లం జలాశయంలో తగినంత నీరున్నా.. రైతాంగానికి ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది.

సీమకు నీళ్లేవీ?

  • 5 రోజుల క్రితమే 855 అడుగులు దాటిన శ్రీశైలం డ్యాం..
  • అయినా ప్రాజెక్టులకు విడుదల కాని నీరు
  • తెలంగాణ తోడేస్తున్నా ప్రభుత్వం మీనమేషాలు

(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

కరువు సీమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.  శ్రీశై లం జలాశయంలో తగినంత నీరున్నా.. రైతాంగానికి ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. వచ్చిన వరదను వచ్చినట్లు విద్యుదుత్పత్తి పేరిట తెలంగాణ తోడేస్తూ.. సాగర్‌కు మళ్లిస్తుంటే.. అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. ఫలితంగా లక్షలాది ఎకరాల ఆయకట్టుకు ఖరీ్‌ఫలో నీరిచ్చే పరిస్థితి కనబడడం లేదు. కృష్ణా ఎగు వ పరివాహక ప్రాంతాల నుంచి 35 రోజులుగా వరదలు కొనసాగుతున్నా పోతిరెడ్డిపాడు ద్వారా సీమ ప్రాజెక్టులకు నీళ్లివ్వడానికి సంకోచిస్తోంది. ప్రభుత్వం అనుమతులు లేవనే కారణంగా కర్నూలు జిల్లా యం త్రాంగం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తుండడం రైతుల కు ఆగ్రహం తెప్పిస్తోంది.


ఇప్పటికే ఒక విడత వచ్చిన వరదను వినియోగించుకోలే దు. 5 రోజుల క్రితమే జలాశయంలో నీటిమట్టం 855 అ డుగులకు చేరింది. అయినా రైతులకు నీరివ్వడానికి ప్రభు త్వం మీనమేషాలు లెక్కిస్తోం ది. వచ్చిన 147 టీఎంసీల వరదలో 60ుకిపైగా తెలంగాణ తోడేస్తున్నా చలనంలే దు. పరిస్థితి ఇలాగే కొనసాగి తే గత ఏడాదిలాగే ఖరీ్‌ఫకు నీరివ్వకుండా వందలాది టీ ఎంసీలను దిగువకు వదిలి స ముద్రంలో కలపడం ఖాయంగా కనిపిస్తోంది.


నెలన్నరగా ఎదురుచూపులు..

జూలై తొలివారం నుంచి దాదాపు 35 రోజులకుపై గా ఎగువ నుంచి వరద వస్తున్నా శ్రీశైలం డ్యాం 855 అడుగులు చేరడానికి 35 రోజులు పట్టింది. వచ్చిన నీళ్లను వచ్చినట్లే ఎడమగట్టు భూగర్భ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 800 అడుగుల నుంచే తెలంగాణ తోడేస్తోంది. ఈ క్రమంలో డ్యాం 854 అడుగులు చేరితేతప్ప పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి నీళ్లను తీసుకోవడం కుదరదు. నీటిమట్టం ఎపుడు పెరుగుతుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. రైతు సం ఘాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. జూన్‌-సెప్టెంబరుతో ముగిసే ఖరీ్‌ఫకు కర్నూలులో ఇం తవరకు నీటి మళ్లింపులపై కలెక్టర్‌ వీరపాండియన్‌ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. వరద ఉధృతి తగ్గుము ఖం పడుతోంది. రెండ్రోజుల్లోనే 85 వేల క్యూసెక్కుల కుపైగా తగ్గుతోంది. మరో వారంలో వందల క్యూసెక్కులకు పడిపోవచ్చు.


వీటిని దృష్టిలో పెట్టుకునే తెలంగా ణ అవసరం లేకున్నా నీళ్లను విద్యుదుత్పత్తి కోసం వా డేస్తోంది. ఇప్పటిదాకా వచ్చిన వరదల ద్వారా శ్రీశైలం డ్యాంకు 147 టీఎంసీల నీరు రాగా ఇందులో ఏపీ కేవలం 4 టీఎంసీలను వాడుకోగా.. తెలంగాణ ఏకంగా 82 టీఎంసీలను మళ్లించేసింది.  చంద్రబాబు సీఎంగా ఉండగా రిజర్వాయర్లతో పా టు ఆయకట్టుకు నీళ్లందించి రైతాంగాన్ని ఆదుకున్నారు. ప్ర స్తుత ప్రభుత్వం దీనికి భిన్నం గా కేవలం రిజర్వాయర్లను నింపితేచాలనే వైఖరితో వ్యవహరిస్తోంది. ఫలితంగా వరద తగ్గిపోతే శ్రీశైలంలోని నీళ్లను నెల్లూరు, కింది ప్రాంతాల అ వసరాలకు మళ్లించాల్సి వ స్తుంది. తద్వారా సీమ ప్రాజెక్టుకు నీరందక కేసీ కెనాల్‌ కింద సాగయ్యే కడప, కర్నూ లు జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాలు ఖరీ్‌ఫకు దూరమవ్వాల్సిందే. వాస్తవానికి తుంగభద్ర నుంచి కేసీ కెనాల్‌ కు 10 టీఎంసీల కేటాయింపులున్నాయి. లేదా ముచ్చుమర్రి, మల్యాల, బానకచర్ల నుంచైనా నీళ్లను మళ్లించుకునే అవకాశం ఉంది. కానీ ఇవేమీ పట్టించుకోడం లే దు. చంద్రబాబు పునాది వేశారన్న కారణంగా గుండ్రేవుల ప్రాజెక్టును జగన్‌ పూర్తిగా పక్కన పెట్టేయడం కూడా రాయలసీమ ప్రజలను కష్టాల్లోకి నెట్టేసింది.  Updated Date - 2020-08-12T09:20:26+05:30 IST