శ్రీశైలం ఆలయ ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేత
ABN , First Publish Date - 2020-12-06T00:35:27+05:30 IST
శ్రీశైలంలో అవినీతి కేసులో సస్పెండ్ అయిన తొమ్మిది మంది రెగ్యులర్ సిబ్బందిపై..

కర్నూలు: శ్రీశైలం ఆలయంలో అవినీతి కేసులో సస్పెండ్ అయిన తొమ్మిది మంది రెగ్యులర్ సిబ్బందిపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు దేవాదాయశాఖ కమిషనర్ తెలిపారు. వీరిని తిరిగి విధులోకి తీసుకోవాలని శ్రీశైలం ఆలయ ఈవోకి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇటీవల ఆలయంలో కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈవిషయంలో పలువురిపై అనుమానం వ్యక్తం చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.