అనంతలో శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల సమ్మె
ABN , First Publish Date - 2020-04-21T16:45:37+05:30 IST
అనంతలో శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల సమ్మె

అనంతపురం: గత ఐదు నెలలుగా జీతాలు అందకపోవడంతో జిల్లాలోని శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు సమ్మె బాట పట్టారు. నేటి నుంచి సమ్మెలోకి దిగిన కార్మికులు ఉదయం 9:30 గంటల నుంచి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం నీటిని నిలిపివేశారు. జీతాలు చెల్లించే వరకు విధుల్లోకి రామని కార్మికులు స్పష్టం చేశారు. తాగునీటిని నిలిపివేయడంతో రాయదుర్గం, మడకశిర, కళ్యాణదుర్గం, హిందూపురం నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. నెలరోజుల కిందటే కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది.