ప్రజలకు ఉపయోగపడే బిల్లులను టీడీపీ అడ్డుకుంది: శ్రీకాంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-06-18T20:04:27+05:30 IST

అమరావతి: మండలిలో ప్రజలకు ఉపయోగపడే బిల్లులను టీడీపీ అడ్డుకుందని ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రజలకు ఉపయోగపడే బిల్లులను టీడీపీ అడ్డుకుంది: శ్రీకాంత్‌రెడ్డి

అమరావతి: మండలిలో ప్రజలకు ఉపయోగపడే బిల్లులను టీడీపీ అడ్డుకుందని ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సభా సంప్రదాయాన్ని టీడీపీ ఉల్లంఘించిందన్నారు. సభలో లోకేష్ ఫొటోలు తీయడం, యనమల డిప్యూటీ ఛైర్మన్‌కు స్లిప్పులు పంపడం నిబంధనల ఉల్లంఘనేనన్నారు. చంద్రబాబు అక్రమ నివాసంలో ఉంటూ నిబంధనలు ఉల్లంఘిస్తే, లోకేష్ మండలిలో ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. మంత్రి వెల్లంపల్లిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.


Updated Date - 2020-06-18T20:04:27+05:30 IST