చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన శ్రీకాంత్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-04-28T17:58:00+05:30 IST
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని.. ఆయన లేఖలో ఉపయోగపడే విషయాలేమీ లేవని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని.. ఆయన లేఖలో ఉపయోగపడే విషయాలేమీ లేవని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. పెద్ద ఎత్తున టెస్టులు చేస్తుంటే చంద్రబాబు బాధపడుతున్నారని ఆరోపించారు. కరోనా కేసులు పెరగకుండా తాము కృషి చేస్తున్నామన్నారు. వలస కార్మికులను ఆదుకోవాలని సీఎం ఆదేశించారన్నారు.
చంద్రబాబు రైతుల గురించి మాట్లాడితే రైతులు నవ్వుతారని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఇంద్రభవనంలో ఎంజాయ్ చేస్తూ... బోర్ కొట్టినప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మాట్లాడితే.. వైసీపీ మంత్రులు క్వారంటైన్ చేస్తామంటున్నారు కానీ.. ఒక్కసారైనా అమరావతి వస్తానని అన్నారా? అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు.