-
-
Home » Andhra Pradesh » srikanth reddy ashok babu tdp ycp
-
పిచ్చి ఆలోచనలు శ్రీకాంత్‌రెడ్డి మానుకోవాలి: అశోక్‌బాబు
ABN , First Publish Date - 2020-12-16T01:38:25+05:30 IST
తమ ప్రభుత్వం ఏం చేసినా ప్రజలు నమ్ముతారనే.. పిచ్చి ఆలోచనలు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మానుకోవాలని ఎమ్మెల్సీ అశోక్‌బాబు హెచ్చరించారు.

అమరావతి: తమ ప్రభుత్వం ఏం చేసినా ప్రజలు నమ్ముతారనే.. పిచ్చి ఆలోచనలు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మానుకోవాలని ఎమ్మెల్సీ అశోక్‌బాబు హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుల రాజకీయాలు చేశాడని చెప్పడానికి.. అసలు శ్రీకాంత్‌రెడ్డికి సిగ్గుందా? అని ప్రశ్నించారు. దళితులపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే నిత్యం వారిపై ఎందుకు దాడులు చేస్తున్నారని నిలదీశారు. ప్రభుత్వ సలహాదారులు సహా, 800 కీలక పదవులను మీ వర్గంవారికి కట్టబెట్టుకున్నారని ఆరోపించారు. రాయలసీమకు చంద్రబాబు ఏమీ చేయలేదని చెప్పేముందు.. శ్రీకాంత్‌రెడ్డి పులివెందుల రైతులను అడిగితే.. అతను సిగ్గుతో తలొంచుకునేలా వారే సమాధానం చెబుతారని అశోక్‌బాబు వ్యాఖ్యానించారు.