-
-
Home » Andhra Pradesh » Srikanth Reddy AmravatI
-
అమరావతి ఉద్యమంపై శ్రీకాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-12-16T01:44:02+05:30 IST
అమరావతి ఉద్యమంపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. అమరావతిలో జరుగుతున్న ఉద్యమం...

అమరావతి: అమరావతి ఉద్యమంపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో జరుగుతున్న ఉద్యమం.. ఉత్తరాంధ్ర వ్యతిరేక ఉద్యమమని శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కన్నభూమి అభివృద్ధికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు బినామీల కోసమే ఉద్యమం చేశారని మండిపడ్డారు. విశాఖలో చంద్రబాబు, ఆయన బినామీలు.. లక్షల ఎకరాలు దోచుకున్నది వాస్తవం కాదా అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు పెడతామని చెప్పలేదా అని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధికి బీజేపీ ప్యాకేజీ ఇచ్చి మాట్లాడితే బాగుంటుందని హితువు పలికారు. వీటన్నింటిపై సోము వీర్రాజు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకే రాజధాని అంటున్న సోము వీర్రాజు బీజేపీ మేనిఫెస్టోలో ఏం పెట్టారో చదువుకోవాలని చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేయమని వైసీపీ ప్రభుత్వం చెప్పలేదని వివరించారు. శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని శ్రీకాంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.