డిప్యూటీ కలెక్టర్‌గా బ్యాడ్మింటన్ కిడాంబి శ్రీకాంత్

ABN , First Publish Date - 2020-06-19T03:03:41+05:30 IST

డిప్యూటీ కలెక్టర్‌గా షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆంధ్రప్రదేశ్...

డిప్యూటీ కలెక్టర్‌గా బ్యాడ్మింటన్ కిడాంబి శ్రీకాంత్

అమరావతి: డిప్యూటీ కలెక్టర్‌గా షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీలో ఆయనను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్‌గా కిడాంబి శ్రీకాంత్ శిక్షణ పూర్తి చేసుకోవటంతో ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఒలంపిక్స్ క్రీడలకు శిక్షణ పొందేందుకు గానూ ఆయనకు ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 


కాగా 2017లో శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్ సిరీస్ గెలిచారు. దీంతో శ్రీకాంత్‌కు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించారు. శిక్షణ పూర్తి కావడంతో శ్రీకాంత్.. డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. 


Updated Date - 2020-06-19T03:03:41+05:30 IST