శ్రీకాళహస్తిలో మరో కరోనా మరణం

ABN , First Publish Date - 2020-07-08T15:19:01+05:30 IST

శ్రీకాళహస్తిలో మరో కరోనా మరణం

శ్రీకాళహస్తిలో మరో కరోనా మరణం

తిరుపతి: శ్రీకాళహస్తిలో మరో కరోనా మరణం సంభవించింది. శ్రీకాళహస్తి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన 50 సంవత్సరాల వ్యక్తి మృతి చెందాడు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకున్న సదరు వ్యక్తి ఫలితాలు రాకముందే మరణించాడు. అంత్యక్రియలు కూడా జరిగిపోయాక వచ్చిన ఫలితాల్లో మృతుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో కుటుంబసభ్యులు, సమీప బంధువుల్లో ఆందోళన నెలకొంది. గతంలో శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్‌పేటకు చెందిన ఓ వృద్ధుడు కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో శ్రీకాళహస్తిలో కరోనాతో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు. 

Updated Date - 2020-07-08T15:19:01+05:30 IST