శ్రీకాళహస్తిలో అక్రమంగా శివలింగ ప్రతిష్ట.. కీలక ఆధారాలు లభ్యం

ABN , First Publish Date - 2020-09-17T18:05:19+05:30 IST

శ్రీకాళహస్తి ఆలయంలో అక్రమంగా శివలింగ ప్రతిష్ట కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.

శ్రీకాళహస్తిలో అక్రమంగా శివలింగ ప్రతిష్ట.. కీలక ఆధారాలు లభ్యం

తిరుపతి: శ్రీకాళహస్తి ఆలయంలో అక్రమంగా శివలింగ ప్రతిష్ట కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఆలయ మొదటి గేటు వద్ద ఉన్న రంగుల గోపురం నుంచి  ముగ్గురు తమిళనాడుకు చెందిన భక్తులు విగ్రహాన్ని గోతాము సంచిలో భుజంపై మోస్తూ వెళ్లిన దృశ్యాలను సీసీ టీవీ ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు. ఈ నెల 6న ఏఏ సమయంలో ఎవరెవరు ఆలయంలోకి వెళ్లారో, ఆ సమయంలో ఆధార్ నమోదును అధికారులు పరిశీలించారు. 6న ఉదయం 10.50 గంటలకు విగ్రహంతో ఆలయంలోకి అనుమానితులు ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. ఆలయంలో  అనుమానితులు ఎక్కడెక్కడ తిరిగారో సి.సి ఫుటేజ్‌లో  అధికారులు పరిశీలించారు. సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పూర్తిగా తమ స్వాధీనం చేసుకున్నారు. 6న విగ్రహాన్ని అక్రమంగా ప్రతిష్టించినా, 11 వరకు రామేశ్వరం, కాశీ శివలింగాల మధ్య కొత్తగా మరో లింగం ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. అనుమానితులు తమిళనాడు రాష్ట్రం సేలం ప్రాంతానికి చెందిన వారుగా భావించిన ప్రత్యేక బృందాలు తమిళనాడుకు బయలు దేరి వెళ్లారు. ఆధార్ కార్డులోని చిరునామాల్లో సి.సి పుటేజీలోని మనుషులే ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2020-09-17T18:05:19+05:30 IST