దారుణం..వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో..

ABN , First Publish Date - 2020-07-22T15:52:40+05:30 IST

జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్పీడ్ బేకర్ దాటే సమయంలో అదుపు తప్పి మోటర్ సైకిలిస్ట్ కిందపడిపోయాడు.

దారుణం..వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో..

శ్రీకాకుళం: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్పీడ్ బేకర్ దాటే సమయంలో అదుపు తప్పి మోటర్ సైకిలిస్ట్ కిందపడిపోయాడు. వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని లారీ యువకుడితలపై నుంచి వెళ్ళడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం కంచిలి సమీపంలో జాతీయరహదారిపై చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-07-22T15:52:40+05:30 IST