రేపు కౌంట్‌డౌన్.. ఎల్లుండి నింగిలోకి..
ABN , First Publish Date - 2020-12-15T12:34:59+05:30 IST
రేపు కౌంట్‌డౌన్.. ఎల్లుండి నింగిలోకి..
శ్రీహరికోట(సూళ్లూరుపేట): ఇస్రో విజయాశ్వం పీఎస్‌ఎల్వీ-సీ50 ప్రయోగానికి సిద్ధమైంది. అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకున్న రాకెట్‌ను ఆదివారం షార్‌లోని రెండవ ప్రయోగ వేదికపైకి శాస్త్రవేత్తలు చేరవేశారు. ప్రయోగ రిహార్సల్స్‌ను సోమవారం ప్రారంభించారు. మంగళవారం తుది రిహార్సల్స్ పూర్తి చేసి, రాకెట్ సన్నద్ధత సమావేశం, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశాలు నిర్వహించి ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. బుధవారం కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. గురువారం మధ్యాహ్నం 3.41 గంటలకు కౌంట్‌డౌన్ ముగియగానే 1,410 కిలోల దేశ 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్ -01తో ఈ రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. ఈ ప్రయోగం కోసం షార్‌లోని వాహన అనుసంధాన భవనం (వ్యాబ్)లో పీఎస్ఎల్వీ-సీ50 రాకెట్‌ను శాస్త్రవేత్తలు అనుసంధానం చేసి ప్రయోగ వేదికపైకి చేరవేశారు.