నీట్‌ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2020-09-13T07:59:34+05:30 IST

నీట్‌ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు

నీట్‌ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు

విజయవాడ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): నీట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం రైల్వేశాఖ రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఆదివారం జరిగే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విజయవాడ-గూడూరు, విజయవాడ-విశాఖపట్నం మధ్యన రెండు రైళ్లను నడుపుతోంది. గూడూరు జంక్షన్‌-విజయవాడ జంక్షన్‌ మధ్య నడిచే రైలు నెల్లూరు, బిట్రగుంట, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి, న్యూ గుంటూరు, విజయవాడ స్టేషన్లలో ఆగుతుంది. విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే ప్రత్యేక రైలు విజయవాడ జంక్షన్‌, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుంది.

Updated Date - 2020-09-13T07:59:34+05:30 IST