పోలవరం పునరావాసంపై రేపు ప్రత్యేక భేటీ!

ABN , First Publish Date - 2020-12-29T08:50:43+05:30 IST

భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం నిధుల అవసరాన్ని వివరిస్తూ నివేదికను సమర్పించాలని కోరినా రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోవడంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆగ్రహంతో ఉంది.

పోలవరం పునరావాసంపై రేపు ప్రత్యేక భేటీ!

అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం నిధుల అవసరాన్ని వివరిస్తూ నివేదికను సమర్పించాలని కోరినా రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోవడంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం (30వ తేదీన) రాష్ట్ర జలవనరుల శాఖతో విజయవాడలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ హాజరు కానున్నారు. ఆనాటికి భూసేకరణ, పునరావాస కార్యక్రమాల పూర్తి సమాచారం అందించాలని జలవనరుల శాఖను పీపీఏ ఆదేశించింది.

Updated Date - 2020-12-29T08:50:43+05:30 IST