జర్నలిస్టులకు ప్రత్యేక కొవిడ్‌ ఆస్పత్రులు

ABN , First Publish Date - 2020-08-01T10:12:36+05:30 IST

జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు, వైద్యానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక

జర్నలిస్టులకు ప్రత్యేక కొవిడ్‌ ఆస్పత్రులు

అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు, వైద్యానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ఆస్పత్రులు గుర్తించనున్నట్లు ఏపీ సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పాత్రికేయులకు వైద్యం అందించేందుకు రాష్ట్రస్థాయి నోడల్‌ అధికారిగా సమాచార శాఖ జేడీ కిరణ్‌కుమార్‌ను నియమించినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో విధి నిర్వహణలో జర్నలిస్టులు కొవిడ్‌ బారి న పడి ప్రాణాలు కోల్పోతుండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ శక్రువారం జర్నలిస్టు సంఘాలతో విజయవాడలోచర్చించారు. 

Updated Date - 2020-08-01T10:12:36+05:30 IST