ఇసుక కోసం ప్రత్యేక కార్పొరేషన్‌!

ABN , First Publish Date - 2020-07-15T09:21:25+05:30 IST

రాష్ట్రంలో ఇసుక సరఫరాకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది

ఇసుక కోసం ప్రత్యేక కార్పొరేషన్‌!

  • నేటి కేబినెట్‌ భేటీలో చర్చ
  • గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల వెల్లడి

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇసుక సరఫరాకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. బుధవారం సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. దీనితో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు, 3 రాజధానుల అంశం చర్చకు రానున్నట్లు తెలిసింది. ఏడాదిన్నరగా ఇసుక కొరతను, సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేకపోతోందని.. ఇసుక మాఫియాను అరికట్టలేకపోతోందని విమర్శలు వస్తున్నాయి. ధర నానాటికీ పెరుగుతోందని స్థిరాస్తి వ్యాపారులు ఆందోళన చెం దుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇసుక సరఫరాకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. దీని పై కేబినెట్‌లో చర్చించి ఆమోదించే అవకాశముందని తెలుస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును, సీఆర్‌డీఏ రద్దు బిల్లును గతంలో శాసనసభ ఏకగ్రీంగా ఆమోదించినా.. శాసనమండలి సెలెక్ట్‌ కమిటీకి పంపింది. సాంకేతిక కారణాలు చూపుతూ.. అసెంబ్లీ కార్యదర్శి సెలెక్ట్‌ కమిటీని వేయలేదు. ఈ అంశంపై గందరగోళం తొలగకముందే.. గత నెల లో జరిగిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో మరోసారి ఈ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. మండలిలో ఆమోదం లభించలేదు. అయితే.. శాసనమండలిలో బిల్లులు పెట్టిన నె ల రోజుల తర్వాత.. సహజంగా ఆమోదం పొందుతాయని చె బుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశమూ కేబినెట్‌లో చ ర్చకు వస్తుందని చెబుతున్నారు. ఇంకోవైపు.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ వేయాలన్న నిర్ణయాన్ని కేబినెట్‌ ఆమోదించే అవకాశం ఉంది. కాగా, గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయ్యే ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను కూడా జగన్‌ కేబినెట్‌ భేటీలో వెల్లడిస్తారని తెలిసింది. కాగా.. మంత్రి పదవులకు రాజీనామా చేసినా.. ఆమోదిస్తూ సీఎం జగన్‌ సంతకం చే యనుందున.. కేబినెట్‌ సమావేశానికి పిల్లి సుబాష్‌ చంద్రబో స్‌, మోపిదేవి వెంకటరమణారావు హాజరవుతారని సమా చారం. కొత్తగా మంత్రివర్గంలో చేరేవారి పేర్లను కూడా కేబినెట్‌లో వెల్లడిస్తారని సమాచారం.

Updated Date - 2020-07-15T09:21:25+05:30 IST