స్పీకర్ అంటే మూతి ముడుచుకుని కూర్చోవాలా: తమ్మినేని

ABN , First Publish Date - 2020-07-09T00:30:27+05:30 IST

సీఎం జగన్ దయతోనే ఎమ్మెల్యే అయ్యానని స్పీకర్ తమ్మినేని సీతారం మరోసారి స్పష్టం చేశారు. ఆముదాలవలసలో మాజీ సీఎం వైఎస్ విగ్రహావిష్కరాన్ని ఆవిష్కరించారు.

స్పీకర్ అంటే మూతి ముడుచుకుని కూర్చోవాలా: తమ్మినేని

శ్రీకాకుళం: సీఎం జగన్ దయతోనే ఎమ్మెల్యే అయ్యానని స్పీకర్ తమ్మినేని సీతారం మరోసారి స్పష్టం చేశారు. ఆముదాలవలసలో మాజీ సీఎం వైఎస్ విగ్రహావిష్కరాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ తాను వైసీపీ ఎమ్మెల్యేను.. వైసీపీలో ప్రాథమిక సభ్యుడినని చెప్పారు. ‘‘అలాంటి నేను వైఎస్ జయంతి నిర్వహించకపోతే ఎలా?. స్పీకర్ అంటే మూతి ముడుచుకుని కూర్చోవాలా. నియోజకవర్గ ప్రజల పనులు ఎవరు చేస్తారు. ఖచ్చితంగా మాట్లాడుతాను.  అసెంబ్లీలో మాత్రం నూటికి నూరు శాతం సభాపతిని’’ అని స్పష్టం చేశారు.

Updated Date - 2020-07-09T00:30:27+05:30 IST