ప్రతి విషయంలోనూ న్యాయవ్యవస్థ జోక్యం.. కబ్జానే!
ABN , First Publish Date - 2020-11-26T09:21:14+05:30 IST
శాసన వ్యవస్థ చేసే చట్టాలు అమలు కాకుండా ప్రతి విషయంలోనూ న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం క బ్జా కిందకే వస్తుందని సభాపతి తమ్మినేని సీతా రాం వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని కెవడియాలో బుధవారం జరిగిన 80వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో ఆయన ప్రసంగించారు. రా జ్యాంగానికి మూడు మూల

ఆలిండియా ప్రిసైడింగ్ సదస్సులో స్పీకర్ తమ్మినేని సీతారాం
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): శాసన వ్యవస్థ చేసే చట్టాలు అమలు కాకుండా ప్రతి విషయంలోనూ న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం క బ్జా కిందకే వస్తుందని సభాపతి తమ్మినేని సీతా రాం వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని కెవడియాలో బుధవారం జరిగిన 80వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో ఆయన ప్రసంగించారు. రా జ్యాంగానికి మూడు మూల స్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు వేటికవి స్వతంత్రత కలిగినవని చెప్పారు. వీటికున్న స్వతంత్రత, అధికారాలకు హద్దులు ఉంటాయని గుర్తుచేశారు. ‘గతంలో ఈ 3 వ్యవస్థలూ బాధ్యతాయుతంగా ఉన్నందున ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది. ఇప్పుడీ వ్యవస్థలు ముఖస్తుతి కోసం విధులు, బాధ్యతలను పక్కన పెడుతున్నాయి. చట్టసభలు ఎంతో చర్చించి చేసిన చట్టాలు అమలు కాకుండా ప్రతిపక్షాలు రాజకీ య ఎత్తుగడలతో స్వలాభం కోసం అడ్డుకుంటున్నాయు. చట్టాలను జ్యుడీషియరీ ద్వారా అడ్డుకోవడం ఈ వ్యవస్థల మధ్య ఘర్షణపూరిత వాతావరణానికి కారణమవుతోంది. ఈ మధ్యకాలంలో చట్టసభల నిర్వహణపైనా కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి’ అని అన్నారు.