రైతు అవతారం ఎత్తిన ఎస్పీ

ABN , First Publish Date - 2020-05-13T19:44:28+05:30 IST

అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి రైతు అవతారం ఎత్తారు.

రైతు అవతారం ఎత్తిన ఎస్పీ

తిరుపతి: అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి రైతు అవతారం ఎత్తారు. పొలంలో మాను తోలుతూ, నాట్లు వేస్తూ, వరినారుమల్లు పీకుతూ కూలీలతో సందడి చేశారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి లాక్ డౌన్ పరిస్థితులను పరిశీలించడానికి వెళుతూ.. మార్గ మధ్యంలో ఏర్పేడు మండలంలో ఎస్పీ పర్యటించారు. శ్రీకాళహస్తి, వెంకటగిరి మార్గంలో రాజులపాలెం గ్రామం సమీపంలో రోడ్డుపక్కన పొలంలో పనులు చేస్తున్న రైతు కూలీలను చూశారు. దీంతో అక్కడే వాహనాన్ని నిలిపి పొలంబాట పట్టారు. 


యూనిఫారమ్‌తోనే ఎస్పీ చేలోకి దిగారు. రైతులతో కలిసి నాట్లు వేశారు. వ్యవసాయ కుటుంబం నేపథ్యం, అగ్రికల్చర్ బీఎస్సీ చదివిన అనుభవం ఉన్న ఎస్పీ రమేష్ రెడ్డి తమ కంటే వేగంగా నాట్లు వేయడాన్ని చూసి రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా గంటపాటు ఎస్పీ పొలంలోనే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అనంతరం అక్కడున్న 53 మంది రైతు కూలీలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. రూ. 5వేల నగదును తనవంతు సాయంగా అందించారు. ఎస్పీస్థాయి వ్యక్తి తమతో కలిసి పొలంలో పనులు చేసినందుకు రైతు కూలీలు ఉప్పొంగిపోయారు.

Read more