‘పరిష్కృ‌త’ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించిన ఎస్పీ

ABN , First Publish Date - 2020-08-12T21:28:51+05:30 IST

జిల్లా కేంద్రంలోని దిశ పోలీస్ స్టేషన్‌లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ ‘పరిష్కృత’ను అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రారంభించారు. కుటుంబ సమస్యల పరిష్కారం కోసం ఈ సెంటర్ పనిచేయనుంది. పరిష్కృత

‘పరిష్కృ‌త’ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించిన ఎస్పీ

గుంటూరు: జిల్లా కేంద్రంలోని దిశ పోలీస్ స్టేషన్‌లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ ‘పరిష్కృత’ను అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రారంభించారు. కుటుంబ సమస్యల పరిష్కారం కోసం ఈ సెంటర్ పనిచేయనుంది. పరిష్కృత ప్రారంభోత్సవం సందర్భంగా ఎస్పీ అమ్మిరెడ్డి మాట్లాడారు. దిశ పోలీస్ స్టేషన్‌లో పరిష్కృత ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఫిర్యాదుదారులు, ప్రతివాదుల నుండి తీసుకున్న ఒప్పందాలను రికార్డు చేస్తామని ఎస్పీ తెలిపారు. కుటుంబ వ్యవస్థ విచ్చినమవుతున్న నేపథ్యంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ చాలా ముఖ్యం అని ఎస్పీ పేర్కొన్నారు. చిన్న కారణాలతో భార్యాభర్తలు విడిపోతున్నారని, కౌన్సిలింగ్ ద్వారా భార్య భర్తలు తమ కుటుంబం గురించి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుందని ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు.

Updated Date - 2020-08-12T21:28:51+05:30 IST