31 లేదా ఒకటిన కేరళకు నైరుతి?
ABN , First Publish Date - 2020-05-24T08:28:48+05:30 IST
నైరుతి రుతుపవనాలు కేరళను తాకేందుకు అనుకూల పరిస్థితులు నెలకొంటున్నాయి. రానున్న రెండు,మూడు రోజుల తరువాత కేరళలో భారీవర్షాలు కురుస్తాయని భారత...

విశాఖపట్నం, మే 23(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు కేరళను తాకేందుకు అనుకూల పరిస్థితులు నెలకొంటున్నాయి. రానున్న రెండు,మూడు రోజుల తరువాత కేరళలో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రం, కోస్తా కర్ణాటక ప్రాంతాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కేరళ, దక్షిణ కర్ణాటక తీరానికి ఆనుకుని ఆగ్నేయ అరేబియా సముద్రంలో 30 లేదా 31న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. దీంతో 31 లేదా జూన్ 1న కేరళకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. సాధారణంగా కేరళలో జూన్ ఒకటిన నైరుతి రుతుపవనాలు ప్రవేశించాలి.