55 మండలాల్లో చినుకు జాడే లేదు

ABN , First Publish Date - 2020-06-26T07:55:03+05:30 IST

నైరుతి రుతుపవనాలు సకాలంలోనే ప్రవేశించినా ఇప్పటికీ రాష్ట్రంలోని 55మండలాల్లో చినుకు జాడే లేదు.

55 మండలాల్లో  చినుకు జాడే లేదు










239 చోట్ల అధికం, 207 మండలాల్లో లోటు


అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు సకాలంలోనే ప్రవేశించినా ఇప్పటికీ రాష్ట్రంలోని 55మండలాల్లో చినుకు జాడే లేదు. 207 మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. 39మండలాల్లోఅధికంగా, 182మండలాల్లో సాధారణ వర్షపాతం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సాధారణం కంటే అధికంగానే వర్షపాతం నమోదయ్యింది. 670 మండలాల్లో 81.8మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 4ు అధికంగా 85.1 మి.మీ. నమోదయింది.


కృష్ణా, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా, కడప, చిత్తూరు జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా..  మిగిలిన జిల్లాలు సాధారణ స్థాయిలోనే ఉంది. రాయలసీమలో సగం మండలాల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. చిత్తూరు జిల్లాలో 23, అనంతపురంలో 11, కడప జిల్లాలో 9 మండలాల్లో ఖరీఫ్‌ సాగు ప్రారంభం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో ఈపాటికి 3.66లక్షల హెక్టార్లలో విత్తనం పడాల్సి ఉండగా, 2.85 లక్షల హెక్టార్లే సాగులోకి వచ్చింది. రాయలసీమలో 50వేల హెక్టార్లలో విత్తనం పడలేదు. 

Updated Date - 2020-06-26T07:55:03+05:30 IST