-
-
Home » Andhra Pradesh » Somuveerraju Eluru Hospital visit
-
వింత వ్యాధి ప్రబలకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: సోమువీర్రాజు
ABN , First Publish Date - 2020-12-06T20:52:36+05:30 IST
ఏలూరు ఆస్పత్రిలో రోగులను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పరామర్శించారు.

ప.గో.: ఏలూరు ఆస్పత్రిలో రోగులను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏలూరులో భయంకరమైన వాతావరణం నెలకొందని, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఫిట్స్‌తో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.
ఒకేసారి 300కు పైగా అస్వస్థతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈరోగం విస్తరించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా కాల్వలో కరోనాకు సంబంధించిన వేస్ట్ మెటీరియల్ వేస్తున్నారని దాని వల్లే ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఏలూరులో పారిశుధ్య లోపం కారణంగానే ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యానికి గురయ్యారన్నారు. ఆస్పత్రిలో చిన్నారులు, వృద్ధులను చూస్తుంటే బాదేసిందని ఆవేదన చెందారు. సీఎం వెంటనే ఏలూరు వచ్చి పరిస్థితిని సమీక్షించాలని చెప్పారు.