సోము వీర్రాజు సీరియస్.. అవినీతి ఎమ్మెల్యేలకు వార్నింగ్

ABN , First Publish Date - 2020-12-27T02:23:53+05:30 IST

అవినీతి పరులైన ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. అధికారులు.. ఎమ్మెల్యేల మోచేతి కింద నీళ్లు తాగుతున్నారని ...

సోము వీర్రాజు సీరియస్.. అవినీతి ఎమ్మెల్యేలకు వార్నింగ్

నెల్లూరు: అవినీతి పరులైన ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. అధికారులు.. ఎమ్మెల్యేల మోచేతి కింద నీళ్లు తాగుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ తీవ్రవాదులకే భయపడని బీజేపీ కార్యకర్తలు వైసీపీకి భయపడతారా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం భారీగా నిధులిస్తున్నా ఏపీలో అభివృద్ధి జరగడం లేదని ఎద్దేవా చేశారు. బ్యాంకుల ముందు చెత్త రాజకీయాలు చేస్తుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదన్నారు. ఇసుక, మట్టి, ఎర్రచందనం వైసీపీ ఎమ్మెల్యేలు అమ్ముకుంటూ నిజాయితీగా ఉండే బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడతారా? అని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-12-27T02:23:53+05:30 IST