విశాఖ ఘటనపై సోము వీర్రాజు దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2020-08-01T21:26:53+05:30 IST

విశాఖ‌ హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కూలి 10 మంది చనిపోయిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక

విశాఖ ఘటనపై సోము వీర్రాజు దిగ్భ్రాంతి

అమరావతి: విశాఖ‌ హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కూలి 10 మంది చనిపోయిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని బీజేపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘క్రేన్ ప్రమాద ఘటన బాధాకరం. 10 మందికి పైనే మృతి చెందినట్లు‌ తెలుస్తోంది. సిబ్బంది, సందర్శకులు కూడా ప్రాణాలు కోల్పోవడం‌ బాధాకరం. బీజేపీ ఎమ్మెల్సీ ‌మాధవ్, ఇతర నాయకులను ఘటనా స్థలానికి‌ చేరుకుని సహాయ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించాం. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని కోరతాం.’ అని అన్నారు.

Updated Date - 2020-08-01T21:26:53+05:30 IST