జగన్‌కు సోము వీర్రాజు లేఖ

ABN , First Publish Date - 2020-12-30T23:02:34+05:30 IST

సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. జీఓ 77ను తక్షణం రద్దుచేయాలని డిమాండ్ చేశారు. 77 జారీ చేయడం ద్వారా విద్యాదీవెన

జగన్‌కు సోము వీర్రాజు లేఖ

అమరావతి: సీఎం జగన్‌కు బీజేపీ నేత సోము వీర్రాజు లేఖ రాశారు. పేదలకు శాపంగా మారిన జీవో 77ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని చెప్పడం దుర్మార్గమన్నారు. జీవోను రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని సోము వీర్రాజు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగంలో మార్పులు తెస్తామన్న మార్పు ఇదేనా అని వీర్రాజు ప్రశ్నించారు. జగనన్న వసతి, విద్యాదీవెన పథకాలు అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రలు అప్పులు చెల్లించలేక ఆస్తులు అమ్ముకుంటున్నారని, అందువల్ల విదేశీ విద్యాదీవెన కూడా వెంటనే ప్రారంభించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-12-30T23:02:34+05:30 IST