చంద్రబాబు జారీ చేసిన జీవోలు ఇంకా అమలు కాలేదు: సోమువీర్రాజు

ABN , First Publish Date - 2020-12-19T16:05:51+05:30 IST

నీటి విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

చంద్రబాబు జారీ చేసిన జీవోలు ఇంకా అమలు కాలేదు: సోమువీర్రాజు

కర్నూలు జిల్లా: నీటి విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శనివారం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల కోసం జారీ చేసిన జీవోలు ఇంకా అమలు కాలేదన్నారు. రాయలసీమలోని ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం మాదిరిగా రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సీమ ప్రాజెక్టులపై కర్ణాటకతో చర్చలు జరపాలని సోమువీర్రాజు ప్రభుత్వానికి సూచించారు.


రాయలసీమలో కేంద్రం చేసిన అభివృద్ధిని ప్రభుత్వం దాస్తోందని సోమువీర్రాజు విమర్శించారు. రాయలసీమలోని ఎర్రచందనాన్ని ప్రభుత్వం స్మగ్లర్లకు వదిలేసిందని ఆరోపించారు. ప్రత్యేక రాయలసీమకు బీజేపీ మద్దతివ్వదని ఆయన అన్నారు. జనసేనతో తప్ప ఏ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదని సోమువీర్రాజు స్పష్టం చేశారు.

Read more