కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2020-09-21T19:36:44+05:30 IST

మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.

కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: సోము వీర్రాజు

విజయవాడ: మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. నాని వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న ఆయన.. తిరుమలలో ఎవరైనా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు. ఇందులో రెండో చర్చ లేదని పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి చేయి విరిగిపోతే నష్టమేంటని మంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారని, దేవుడిపై కూడా ఇలాంటి భాష మాట్లాడడం బాధాకరమని అన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలామ్ సంతకం పెట్టారని సోము వీర్రాజు తెలిపారు.


హిందూ దేవుళ్లపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. కొడాలి నానికి వ్యతిరేకంగా బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాని వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతి అలిపిరి వద్ద బీజేపీ నేతలు నిరసన చేపట్టారు.

Updated Date - 2020-09-21T19:36:44+05:30 IST