సోమువీర్రాజు అరెస్ట్

ABN , First Publish Date - 2020-09-17T22:57:50+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఛలో అమలాపురం’ కార్యక్రమానికి సోమువీర్రాజు బయల్దేరారు. ఆయన్ను విజయవాడలో పోలీసులు అడ్డుకున్నారు.

సోమువీర్రాజు అరెస్ట్

అమరావతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఛలో అమలాపురం’ కార్యక్రమానికి సోమువీర్రాజు బయల్దేరారు. ఆయన్ను విజయవాడలో పోలీసులు అడ్డుకున్నారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నందున ముందస్తు అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఛలో అమలాపురం నిర్వహిస్తున్నట్లు సోము వీర్రాజు ప్రకటించారు. ఛలో అమలాపురం కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించలేదన్నారు. అయితే గ్రామ వాలంటీర్ల ద్వారా బీజేపీ కార్యకర్తల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని, అందువల్ల ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్యకంగా తీసుకున్నామని వీర్రాజు చెబుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ఐదు పార్లమెంటు నియోజక వర్గాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు ఛలో అమలాపురం కార్యక్రమంలో పాల్గొంటారని వీర్రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజును కూడా పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అంతర్వేది సందర్శనకు వెళ్తామని ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగా నోటీసు ఇచ్చి పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.  

Updated Date - 2020-09-17T22:57:50+05:30 IST