‘స్థానిక’ ప్రక్రియను రద్దు చేయాలి: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2020-12-11T08:05:16+05:30 IST

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 ఎంపీటీసీలు, 2వేల జడ్పీటీసీ స్థానాలను ఎన్నికల

‘స్థానిక’ ప్రక్రియను రద్దు చేయాలి: సోము వీర్రాజు

కడప, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 ఎంపీటీసీలు, 2వేల జడ్పీటీసీ స్థానాలను ఎన్నికల కమిషనర్‌ వైసీపీకి ఏకగ్రీవమిచ్చారు. వాటిని రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేయాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన కడపలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ రద్దు కోసం అవసరమైతే ఎన్నికల కమిషనర్‌ హైకోర్టును ఆశ్రయించాలని సూచించారు.  

Updated Date - 2020-12-11T08:05:16+05:30 IST