దుర్గగుడిని పరిశీలించిన సోము వీర్రాజు బృందం

ABN , First Publish Date - 2020-09-16T17:07:11+05:30 IST

దుర్గగుడిలో సాక్షాత్తూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని వెండి రథంపై ఉన్న..

దుర్గగుడిని పరిశీలించిన సోము వీర్రాజు బృందం

విజయవాడ: దుర్గగుడిలో సాక్షాత్తూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని వెండి రథంపై ఉన్న నాలుగు సింహాల్లో మూడు మాయం కావడం చర్చనీయాంశమైంది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బృందం ఆలయానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇవాళ గవర్నర్‌ను కలుస్తున్నామని, అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నామని చెప్పారు. కారువాక అనే కార్యక్రమంలో దుర్గగుడి దగ్గర ఉన్న రథానికి అత్యంత ప్రాధాన్యత ఉందని, అలాంటి రథానికి అసలు భద్రతే లేదని విచారం వ్యక్తం చేశారు.


దుర్గమ్మ వెండి రథం సింహాల ప్రతిమలు మాయం అయ్యాయని, నాలుగు ప్రతిమల్లో మూడు కన్పించడంలేదని సోము వీర్రాజు అన్నారు. నాలుగోది కూడా ధ్వంసం చేసేందుకు యత్నించారని, ఇక్కడ ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతున్నాయని, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు అన్నారు.

Updated Date - 2020-09-16T17:07:11+05:30 IST