మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను బర్తరఫ్ చేయాలి: సోమిశెట్టి వెంకటేశ్వర్లు
ABN , First Publish Date - 2020-12-01T19:51:05+05:30 IST
దేవాదాయశాఖను సక్రమంగా నిర్వహించలేని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.
కర్నూలు: దేవాదాయశాఖను సక్రమంగా నిర్వహించలేని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. సీఎం జగన్, మంత్రుల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతోందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం మంత్రాలయ భూములను అమ్ముతూ హిందూవుల మనోభావాలు దెబ్బతిస్తున్నారని చెప్పారు. పూజారులపై దాడులు జరుగుతున్న పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. అసెంబ్లీలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. స్పీకర్ వైసీపీ ఎమ్మెల్యేలకు వత్తాసు పలుకుతూ నిజాలను ప్రజలకు తెలియకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రైతులకు తుపాన్లతో తీవ్ర నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయిందని ఆరోపించారు.