లాక్‌డౌన్‌ను ఉగాది దీక్షగా చేపడదాం: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2020-03-25T17:03:51+05:30 IST

అమరావతి: ఊహించని రీతిలో కరోనా రూపంలో ప్రళయం ముంచుకొచ్చిందని.. ప్రధాని మోదీనే చేతులెత్తి వేడుకునే పరిస్థితులు వచ్చాయని..

లాక్‌డౌన్‌ను ఉగాది దీక్షగా చేపడదాం: సోమిరెడ్డి

అమరావతి: ఊహించని రీతిలో కరోనా రూపంలో ప్రళయం ముంచుకొచ్చిందని.. ప్రధాని మోదీనే చేతులెత్తి వేడుకునే పరిస్థితులు వచ్చాయని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటిద్దామన్నారు. లాక్‌డౌన్‌ను ఉగాది దీక్షగా చేపడదామని సోమిరెడ్డి పిలుపునిచ్చారు. దినసరి కూలీలను ఆదుకోవడం బాధ్యతగా భావిద్దామన్నారు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ప్రపంచంలో ఎప్పుడూ రాలేదన్నారు. కొన్ని దేశాల నిర్లక్ష్యంతో భారీ ప్రాణ నష్టం చూశామన్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా దేశ గొప్పతనాన్ని చాటుదామన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరం భాగస్వాములవుదామని సోమిరెడ్డి పిలుపునిచ్చారు. 


Read more