అమరావతి మరో ఢిల్లీ కావాలని మోదీ ఆశీర్వదించారు: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2020-08-01T18:54:32+05:30 IST

నెల్లూరు: సీఎం జగన్ అమరావతిని బీడు పెట్టాలనుకోవడం, గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించడం దురదృష్టకరం,

అమరావతి మరో ఢిల్లీ కావాలని మోదీ ఆశీర్వదించారు: సోమిరెడ్డి

నెల్లూరు: సీఎం జగన్ అమరావతిని బీడు పెట్టాలనుకోవడం, గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించడం దురదృష్టకరం, దుర్మార్గమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. నిండు శాసనసభలో అప్పటి సీఎంగా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి రాజధానిగా అమరావతిని ఆమోదించారన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారన్నారు.


అమరావతి మరో ఢిల్లీ కావాలని మోదీ ఆశీర్వదించారని సోమిరెడ్డి పేర్కొన్నారు. పది వేల కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన భవనాలను శిథిలాలుగా మార్చేస్తారా అని ప్రశ్నించారు. కక్ష సాధింపులు పేదలపై చూపడం తగదన్నారు. బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు కూడా బాధాకరమ్నారు. రాజధాని విషయంలో జగన్ నిర్ణయం తప్పని... ప్రజాగ్రహానికి గురికాక తప్పదని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-08-01T18:54:32+05:30 IST