ప్రైవేటు పాఠశాలల సమస్యలు పరిష్కరించండి
ABN , First Publish Date - 2020-11-13T09:33:38+05:30 IST
ప్రైవేటు పాఠశాలల సమస్యలు పరిష్కరించండి
సీఎంకు యాజమాన్యాల వినతి
విజయవాడ సిటీ, నవంబరు 12: పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్, బడ్జెట్ పాఠశాలల సమస్యలు పరిష్కరించి.. చిన్నపాఠశాలల మనుగడను కాపాడాలని ఏపీ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ సంఘం నేతలు కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. పాఠశాలల రెన్యువల్స్‌ను తిరిగి పదేళ్లుగానే ఉంచాలని కోరారు.