అవన్నీ మూఢ నమ్మకాలే: జన విజ్ఞాన వేదిక

ABN , First Publish Date - 2020-06-21T16:56:37+05:30 IST

సూర్యగ్రహణాన్ని వీక్షిస్తే అరిష్టం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని జన విజ్ఞాన వేదిక సభ్యులు కొట్టిపారేశారు. అవన్నీ మూఢ నమ్మకాలంటూ సూర్యగ్రహణాన్ని వీక్షించారు. వెల్డింగ్ చేసేటప్పుడు

అవన్నీ మూఢ నమ్మకాలే: జన విజ్ఞాన వేదిక

విజయవాడ: సూర్యగ్రహణాన్ని వీక్షిస్తే అరిష్టం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని జన విజ్ఞాన వేదిక సభ్యులు కొట్టిపారేశారు. అవన్నీ మూఢ నమ్మకాలంటూ సూర్యగ్రహణాన్ని వీక్షించారు. వెల్డింగ్ చేసేటప్పుడు ఉపయోగించే గ్లాస్ ద్వారా సూర్య గ్రహణాన్ని వీక్షించారు. సూర్య గ్రహణం సమయంలో ఆహారం విషంగా మారుతుందనేది మూఢ నమ్మకం అన్నారు. గ్రహణ సమయంలో ఆహారం విషంగా మారటం లేదని రుజువు చేసేందుకు జన విజ్ఞాన వేదిక సభ్యులు ఆహారాన్ని తిని చూపించారు. అదేవిధంగా పిల్లలకు లోపాలు ఉంటే వారిని గ్రహణ మొర్రి అనడం కూడా మూఢ నమ్మకమే అని కొట్టిపారేశారు.

Updated Date - 2020-06-21T16:56:37+05:30 IST