సొసైటీ ఛైర్మన్ సుబ్బరామిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి

ABN , First Publish Date - 2020-10-01T20:09:28+05:30 IST

నెల్లూరు: కోవూరు మం పడుగుపాడు సొసైటీ ఛైర్మన్ ములుముడి సుబ్బరామిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

సొసైటీ ఛైర్మన్ సుబ్బరామిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి

నెల్లూరు: కోవూరు మం పడుగుపాడు సొసైటీ ఛైర్మన్ ములుముడి సుబ్బరామిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కావలి తెట్టు ప్రాంతంలో రైలు పట్టాలపై మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకు అత్యంత సన్నిహితుడు. దీంతో ఎమ్మెల్యే ప్రసన్న, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. సుబ్బరామిరెడ్డిని నిన్న గుర్తి తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు కోవూరు పోలీస్ స్టేషన్‌లో అతని భార్య పిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే సుబ్బరామిరెడ్డి మృతదేహం లభ్యమైంది.

Updated Date - 2020-10-01T20:09:28+05:30 IST