వైసీపీ ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు

ABN , First Publish Date - 2020-06-25T21:52:29+05:30 IST

కమలాపురం నియోజకవర్గం వెల్లటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

వైసీపీ ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు

కడప జిల్లా: కమలాపురం నియోజకవర్గం వెల్లటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోలార్ పార్క్ ఏర్పాటుకు స్థలం పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. సోలార్ పార్క్ వద్దంటూ మూడు గ్రామాల ప్రజలు నిరసన తెలిపారు. రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్ మేనమామ అయిన రవీంధ్రనాథ్ రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురవడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపింది. ఎండ్లమర్రి మండలం, రెడ్డిపల్లె, వెల్లటూరు, సహవాసగానెపల్లె, కొత్తగిరిపల్లె తదితర ప్రాంతాల్లో సాగు భూములు ఎక్కువ ఉన్నందున సోలార్ ప్లాంట్ ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.

Updated Date - 2020-06-25T21:52:29+05:30 IST