విశాఖలో పుర్రె కలకలం

ABN , First Publish Date - 2020-08-16T22:26:06+05:30 IST

విశాఖ రెల్లి వీధిలో మనిషి పుర్రె కలకలం రేగింది. పాడుబడ్డ ఇంట్లో మనిషి పుర్రెను చూసి స్థానికులు భయాందోళన చెందారు. పుర్రెను ఓ వ్యక్తి కాల్చుతుండగా స్థానికులు

విశాఖలో పుర్రె కలకలం

విశాఖ: విశాఖ రెల్లి వీధిలో మనిషి పుర్రె కలకలం రేగింది. పాడుబడ్డ ఇంట్లో మనిషి పుర్రెను చూసి స్థానికులు భయాందోళన చెందారు. పుర్రెను ఓ వ్యక్తి కాల్చుతుండగా స్థానికులు చూసినట్లు సమాచారం. రాజు అనే వ్యక్తిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల వారి సమాచారంతో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే నిందితుడిపై సస్పెక్ట్ షీట్‌ ఉందని పోలీసులు తెలిపారు. పుర్రె స్మశానం నుంచి తెచ్చి ఉంటాడని, పుర్రెను కాల్చుకోవడం అవాస్తవం అని పోలీసులు తేల్చారు.

Updated Date - 2020-08-16T22:26:06+05:30 IST