విజయవాడలో ఎస్.పి.బాలు కోసం మృత్యుంజయ హోమం

ABN , First Publish Date - 2020-08-22T15:48:50+05:30 IST

కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం కోసం విజయవాడలో మృత్యుంజయ హోమం నిర్వహించారు.

విజయవాడలో ఎస్.పి.బాలు కోసం మృత్యుంజయ హోమం

విజయవాడ: కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం కోసం విజయవాడలో  మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఎస్.పి.బాలసుబ్రమణ్యం  కరోనా నుంచి త్వరగా  కోలుకోవాలని ఈ మృత్యుంజయ హోమాన్ని చేపట్టారు. వేదపండితులు, ఎస్‌పీబీ అభిమానుల ఆధ్వర్యంలో ఈ  హోమం జరుగుతోంది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ హోమంలో 1011 సార్లు మృత్యుంజయ మంత్రం జపిస్తూ నవగ్రహ, మృత్యుంజయ హోమం నిర్వహించారు. మహా పూర్ణాహుర్తితో  హోమం ముగిసింది. ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఆరోగ్యంగా ఉండి మళ్ళీ అయన పాటలు పాడాలని  అభిమానులు పూజలు, హోమాలు చేస్తున్నారు. 


Updated Date - 2020-08-22T15:48:50+05:30 IST