సింహాచలంలో నిజరూపదర్శనం చేసుకున్న భక్తుడు
ABN , First Publish Date - 2020-04-29T01:47:50+05:30 IST
తిరుపతి శ్రీను అనే భక్తుడు సింహాచంలో చందనోత్సవం రోజున నరసింహ స్వామి నిజరూప దర్శనం చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు

విశాఖపట్నం: తిరుపతి శ్రీను అనే భక్తుడు సింహాచంలో చందనోత్సవం రోజున నరసింహ స్వామి నిజరూప దర్శనం చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. లాక్‌డౌన్ వేళ శ్రీను ఆలయానికి ఎలా వచ్చాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలోకి ఎవరికీ ప్రవేశం లేదని ఆలయ అధికారులు ముందుగానే ప్రకటించారు. అయితే శ్రీను ఎలా వచ్చాడనేది చర్చనీయాంశమైంది. చందనోత్సవం ముందు రోజే శ్రీను కొండపైకి వచ్చి, ఆ రోజు రాత్రి అక్కడే బస చేసినట్లు తెలుస్తోంది. అలా అతను మరుసటి రోజు మధ్యాహ్నం స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నాడని అధికారులు గుర్తించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ కొనసాగుతోందని ఆలయ ఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. కాగా, చందనోత్సవం రోజున ఎవరికీ అనుమతి లేదంటూనే.. కలెక్టర్లు, మినిస్టర్లు, పీఠాధిపతులు, అశోక్ గజపతిరాజును సైతం అధికారులు అనుమతించారు.