సింహాచలం, మాన్సాస్‌ నియామకాలపై న్యాయపోరాటం

ABN , First Publish Date - 2020-03-12T10:04:36+05:30 IST

సింహాచల దేవస్థానం ట్రస్టుబోర్డు, మాన్సాస్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌గా సంచయితను నియమిస్తూ తీసుకున్న నిర్ణయాలను

సింహాచలం, మాన్సాస్‌ నియామకాలపై న్యాయపోరాటం

  • విశ్వహిందూ పరిషత్‌ నేతల వెల్లడి

విజయవాడ(సత్యనారాయణపురం), మార్చి 11: సింహాచల దేవస్థానం ట్రస్టుబోర్డు, మాన్సాస్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌గా సంచయితను నియమిస్తూ తీసుకున్న నిర్ణయాలను, హధీరామ్‌జీ మఠం స్వాధీనం చేసుకునే నిర్ణయాన్ని  రాష్ట్రప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర కార్యాధ్యక్షులు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, రాష్ట్రకార్యదర్శి టీ.ఎ్‌స.రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. విజయవాడలోని వీహెచ్‌పీ కార్యాలయంలో బుధవారం విలేకరు ల సమావేశంలో వారు మాట్లాడారు.  తొలుత ఆశోక్‌గజపతిరాజును సింహాచల దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్‌గా ప్రకటించారని, రెండు రోజుల్లోనే కొత్త జీవోను తీసుకు వచ్చి సంచయితను నియమించి, ఆ తర్వాత జీవోను బయటపెట్టారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, దీని వెనుక  కుట్రదాగి ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. అశోక్‌ గజపతిరాజును చైర్మన్‌ ఎందుకు నియమించారు, ఎందుకు రద్దు చేశారు, సంచయితను ఎందుకు నియమించారు వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. సంచయిత ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వేదికగా చేసిన పోస్టులతో ఆమె హిందువా, క్రిస్టియనా అన్న అనుమానాలు కలుగుతున్నాయని, ఆమె ఇంత వరకూ ఏ హిందూ దేవాలయాల్లోను, హిందూ ఉత్సవాల్లోను పాల్గొన్న ఆధారాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  మొదటి నుంచి హిందూ సమాజానికి వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.  అధికారంలోకి రాగానే దేవాలయాలకు చెందిన భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేసిందని అన్నారు.

Updated Date - 2020-03-12T10:04:36+05:30 IST