-
-
Home » Andhra Pradesh » silver lion idols theft case police investigation continue
-
వెండి సింహాల చోరీ కేసులో కొనసాగుతున్న విచారణ
ABN , First Publish Date - 2020-10-07T16:40:07+05:30 IST
కనకదుర్గమ్మ గుడిలోని రథానికి ఉన్న వెండి సింహాల ప్రతిమల చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో ఇప్పటి వరకు 100 మందిని విచారించారు. అయితే ఇప్పటి వరకు

విజయవాడ: కనకదుర్గమ్మ గుడిలోని రథానికి ఉన్న వెండి సింహాల ప్రతిమల చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో ఇప్పటి వరకు 100 మందిని విచారించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సింహాల ప్రతిమల చోరీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించడంతో ఎలాగైనా ఈ కేసును చేధించాలని పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ ఆధికారులు సేకరించిన ఆధారాల కోసం ఇంతకాలం ఎదురుచూశారు. అయితే ఇక్కడా వారికి షాక్ తగిలింది. ఫోరెన్సిక్ నివేదికలోనూ ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో దర్యాప్తులో స్పీడ్ తగ్గినట్లైంది. సింహాల ప్రతిమల చోరీ ఇంటి దొంగల పనిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలాఉంటే, రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు మౌనం పాటిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.