దుకాణాదారుడ్ని బూటుతో తన్నిన ఎస్సైపై చర్యలు

ABN , First Publish Date - 2020-04-07T20:19:49+05:30 IST

కృష్ణా : జిల్లాలోని నూజివీడు టౌన్‌ పరిధిలో ఓ దుకాణాదారుడ్ని ఎస్సై

దుకాణాదారుడ్ని బూటుతో తన్నిన ఎస్సైపై చర్యలు

కృష్ణా : జిల్లాలోని నూజివీడు టౌన్‌ పరిధిలో ఓ దుకాణాదారుడ్ని ఎస్సై శ్రీనివాసరావు బూటుకాలితో తన్నిన వ్యవహారం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఆ ఎస్సైపై చర్యలు తీసుకున్నారు. ఎస్సైను వీఆర్‌లో పెట్టినట్లు ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు. 


అసలేం జరిగింది..!?

రెడ్ జోన్ పరిధిలో అనుమతి సమయం ముగిసినా నిత్యవసర సరుకుల దుకాణం తెరిచి వుంచి వ్యాపారం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై అక్కడికి చేరుకుని తీవ్ర ఆగ్రహంతో దుకాణదారుడ్ని బూటు కాలుతో కొట్టి గాయపరిచాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోవైపు ఆ ఎస్సైపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేయడంతో మంగళవారం నాడు ఉన్నతాధికారులు ఆయన్ను వీఆర్‌కు పంపడం జరిగింది.

Updated Date - 2020-04-07T20:19:49+05:30 IST