-
-
Home » Andhra Pradesh » shut down the Ahobilam Temple
-
అహోబిలం ఆలయాన్ని మూసివేసిన అధికారులు
ABN , First Publish Date - 2020-06-22T21:32:51+05:30 IST
అహోబిలం లక్ష్మినరసింహస్వామి ఆలయంలో పూజారికి కరోనా వైరస్ సోకింది.

కర్నూలు జిల్లా: అహోబిలం లక్ష్మినరసింహస్వామి ఆలయంలో పూజారికి కరోనా వైరస్ సోకింది. ఈ నెల 18న ఆలయం పూజారులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా పూజారికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ అర్చకుడిని క్వారంటైన్‌కు పంపారు. అలాగే దేవాదాయ శాఖ అదేశాల మేరకు ఆలయాన్ని రెండు రోజులు మూసివేయాలని చెప్పడంతో సోమవారం గుడిని మూసివేసినట్లు ఆలయ ఈవో ప్రకటించారు. భక్తులు తమ అహోబిలం యాత్రను రెండు రోజులు వాయిదా వేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే అక్కడున్న షాపులను కూడా మూసివేశారు.