‘లోపాలున్న పరిశ్రమలను మూసేయండి’
ABN , First Publish Date - 2020-07-19T08:43:02+05:30 IST
‘‘పరిశ్రమల్లో లోపాలు ఏమైనా ఉంటే.. కొన్నాళ్ల పాటు మూసేయండి. లోపాలను సరిదిద్దుకున్న తరువాత పునఃప్రారంభించండి’’ అని విశాఖపట్నం కలెక్టర్ వినయ్‌చంద్,

విశాఖపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ‘‘పరిశ్రమల్లో లోపాలు ఏమైనా ఉంటే.. కొన్నాళ్ల పాటు మూసేయండి. లోపాలను సరిదిద్దుకున్న తరువాత పునఃప్రారంభించండి’’ అని విశాఖపట్నం కలెక్టర్ వినయ్‌చంద్, పారిశ్రామికవేత్తలకు సూచించారు. విశాఖపట్నంలో ఇటీవల వరుసగా మూడు ప్రమాదాలు జరగడంతో ‘పరిశ్రమల్లో భద్రత... చేపట్టాల్సిన చర్యల’పై పారిశ్రామికవేత్తలతో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం సమావేశం నిర్వహించారు. దీనికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆగస్టు రెండో వారంలో పారిశ్రామిక సంస్థలతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈలోగా జిల్లాలోని పరిశ్రమలు తగిన కార్యాచరణతో ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు.