ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాం: శ్రవణ్‌ కుమార్‌

ABN , First Publish Date - 2020-10-27T19:19:31+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కాకుండా ప్రభుత్వం ఇంకా ఎక్కడైనా..

ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాం: శ్రవణ్‌ కుమార్‌

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కాకుండా ప్రభుత్వం ఇంకా ఎక్కడైనా..రాజధాని ఎలా పెడుతుందో చూస్తామని న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అమరావతి దళిత రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామన్నారు. అమరావతిని దళితుల శవాల పైనుంచి తరలించాలన్నారు. ప్రాణాలు పోయినా అమరావతి ఉద్యమాన్ని ఆపేది లేదని.. అమరావతి తరలింపును అడ్డుకుని తీరుతామని శ్రవణ్‌ కుమార్ స్పష్టం చేశారు.


రాజధాని కోసం రైతులు 315 రోజులుగా దీక్షలు చేస్తున్నారని శ్రవణ్‌ కుమార్ అన్నారు. అసలు ఈ దీక్షలు ఎందుకు చేస్తున్నారన్నదానిపై ప్రభుత్వం స్పందించకుండా.. వారిని పిలుచి మాట్లాడకుండా.. వారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు. మీడియా ముందు మాత్రం దళితులు, వారి అభ్యున్నత గురించి ప్రభుత్వం మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అందుకే దళిత రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారికి అండగా నిలబడుతూ పాదయాత్ర చేపట్టామని శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-10-27T19:19:31+05:30 IST