రైతుకు ముందస్తుగా 50% నిధులివ్వాలి: శివాజీ

ABN , First Publish Date - 2020-12-03T09:14:42+05:30 IST

రైతుకు ముందస్తుగా 50% నిధులివ్వాలి: శివాజీ

రైతుకు ముందస్తుగా 50% నిధులివ్వాలి: శివాజీ


న్యూఢిల్లీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): కొత్త రైతు చట్టం ద్వారా అవకాశమిచ్చిన కాంట్రాక్టు సేద్యంలో లోపాలను సరిదిద్దాలని, రైతులకు ఒప్పందం మేరకు ముందస్తుగా 50ు నిధులు ఇవ్వాలని కిసాన్‌ ఫౌండేషన్‌ గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. 2021-22 బడ్జెట్‌ రూపకల్పనకు సలహాలు స్వీకరించడానికి ఆన్‌లైన్‌లో నిర్వహించిన ప్రీబడ్జెట్‌ భేటీలో శివాజీ పలు సూచనలు చేశారు. కనీసం ఐదేళ్ల పాటు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వృత్తి విద్యా కాలేజీల్లో 15ు సీట్లను ప్రత్యేకంగా కేటాయించాలని కోరారు.

Updated Date - 2020-12-03T09:14:42+05:30 IST