-
-
Home » Andhra Pradesh » Shiva kumar comments
-
కేంద్రం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: శివకుమార్
ABN , First Publish Date - 2020-12-30T17:38:45+05:30 IST
తిరుమల: గోరక్షణ... సంరక్షణ జరగాలని టీటీడీ పాలకమండలి సభ్యుడు శివకుమార్ పేర్కొన్నారు.

తిరుమల: గోరక్షణ... సంరక్షణ జరగాలని టీటీడీ పాలకమండలి సభ్యుడు శివకుమార్ పేర్కొన్నారు. అనేక చట్టాలు ఉన్న గోమాతలు కబేలాలకు తరలిపోతున్నాయన్నారు. తెలంగాణలో కబేలాలు మూసివేయ్యాలన్నారు. కేంద్రం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్నారు. గో సడక్ బంద్ పేరుతో జనవరి 8వ తేదీన విజయవాడ జాతీయ రహదారిని దిగ్బoదిస్తామన్నారు. ఎల్బీ నగర్ చౌరస్తాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. పలువురు మఠ, పీఠాధిపతులు కూడా ఈ దిగ్బoధనం కార్యక్రమంలో పాల్గొంటారని శివకుమార్ వెల్లడించారు.