బైరెడ్డిపై శిల్పా చక్రపాణి రెడ్డి కామెంట్స్

ABN , First Publish Date - 2020-06-11T21:51:04+05:30 IST

బైరెడ్డిపై శిల్పా చక్రపాణి రెడ్డి కామెంట్స్

బైరెడ్డిపై శిల్పా చక్రపాణి రెడ్డి కామెంట్స్

కర్నూలు: బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శలు చేశారు. శ్రీశైలం దేవస్థానం అవినీతిలో తన పాత్ర ఉందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు తాను సిద్ధమని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి బైరెడ్డి సవాల్ చేశారు. బైరెడ్డి శ్రీశైలం ప్రతిష్ట పెంచుతున్నాడో, దిగజారుస్తూన్నాడో అర్థం కావడం లేదని చక్రపాణి రెడ్డి అన్నారు. బైరెడ్డి స్థాయి దిగజారి మాట్లాడటం సరికాదని, బైరెడ్డి ఎన్ని వేషాలు వేసిన ఆయన భాషా మాత్రం మారలేదని శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శించారు. బైరెడ్డి రథయాత్ర చేస్తే ముందుండి సహకరిస్తానని శిల్పా చక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు. నంద్యాలలో మహానంది, బండి ఆత్మకూరు మండలాల ముఖ్య నేతలతో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమావేశమయ్యారు.

Updated Date - 2020-06-11T21:51:04+05:30 IST